logo

పంట రుణం పెంచేందుకునిర్ణయం : డీసీసీబీ సీఈవో

రానున్న పంట కాలంలో పంట రుణాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీసీసీబీ సీఈవో విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం డీసీసీబీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిర్ణయ

Published : 21 Jan 2022 01:56 IST

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : రానున్న పంట కాలంలో పంట రుణాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీసీసీబీ సీఈవో విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం డీసీసీబీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిర్ణయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు అధికారులు, రైతు సంఘాల నాయకులు సమావేశానికి హాజరయ్యారు. గతేడాది ఇచ్చిన రుణం, రానున్న రోజుల్లో ఇచ్చే రుణానికి సంబంధించి చర్చించారు. జిల్లాలో సాగు చేసే పంటలు, వాటికి బ్యాంకుల్లో ఇవ్వాల్సిన రుణంపై సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు సీఈవో తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, నాబార్డు డీడీఎం విజయవిహారి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని