logo

ఈ శ్రమ్‌... కార్మికులకు వరం

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కార్మికులకు

Published : 21 Jan 2022 01:56 IST

సభ్యత్వ నమోదుతో ప్రమాద బీమా వర్తింపు

భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు

రామాపురం, రాయచోటి, న్యూస్‌టుడే: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కార్మికులకు సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నమోదు చేయించుకోలేకపోతున్నారు. ఈ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదైన కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది. ప్రమాదానికి గురై మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షల మొత్తం ఇస్తారు.

వీరంతా అర్హులే : వ్యవసాయ కూలీలు, కార్పెంటర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, చేనేత, కుమ్మరి, స్వర్ణ కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, ఆటో, కార్‌ డ్రైవర్లు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, డ్వాక్రా మహిళలు ఈ శ్రమ్‌ పథకంలో సభ్యత్వం తీసుకోవచ్ఛు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ వంటి సదుపాయాలు లేని కార్మికులు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే వారు 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్‌ కోసం ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. తమ ధ్రువపత్రాలు తీసుకెళ్తే కామన్‌ సర్వీస్‌ సెంటర్లు( సీఎస్‌సీ)లో ఉచితంగా నమోదు చేస్తారు.

కార్మికులు సద్వినియోగం చేసుకోండి

ఈ శ్రమ్‌ పథకంలో కార్మికులు ధరఖాస్తు చేసుకునే వీలుంది. సభ్యత్వం తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 276 సీఎస్‌సీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అర్హులంతా సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సభ్యత్వం తీసుకోవచ్ఛు సభ్యత్వం తీసుకున్నాక 12 అంకెల శాశ్వత నంబరుతో కార్డు ఇస్తారు. దీంతో దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభం అవుతుంది. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - సుబ్రహ్మణ్యం సీఎస్‌సీ మేనేజర్‌ కడప జిల్లా

రామాపురం సీఎస్‌సీ కేంద్రంలో సభ్యత్వం తీసుకుంటున్న కార్మికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని