logo

వేతనాలు చెల్లించకుంటే ఎలా బతకాలి?

నగరంలోని శిల్పారామంలో పనిచేస్తున్న కార్మికులకు పది నెలలుగా వేతనాలు అందలేదని వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా, నగర కార్యదర్శి మద్దిలేటి ప్రశ్నించారు. శనివారం శిల్పారామం వద్ద ఏఐటీయూసీ నేతలు కార్మికులతో ప్రత్యేక

Published : 23 Jan 2022 02:32 IST


నిరసన తెలుపుతున్న చిరుద్యోగులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: నగరంలోని శిల్పారామంలో పనిచేస్తున్న కార్మికులకు పది నెలలుగా వేతనాలు అందలేదని వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా, నగర కార్యదర్శి మద్దిలేటి ప్రశ్నించారు. శనివారం శిల్పారామం వద్ద ఏఐటీయూసీ నేతలు కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులకు పదినెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు. పదేళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయడంలేదన్నారు. అయినా సర్దుకుని కుటుంబాలను పోషించుకుంటున్న నేపథ్యంలో వేతనాలు రాకపోతే ఎలాగని ప్రశ్నించారు. తక్షణమే ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్‌లో చేర్చి వేతనాలు చెల్లించాలని కోరారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికుల మాదిరిగానే స్వీపర్లకు రూ. 12 వేలు, సెక్యూరిటీ సిబ్బందికి రూ. 15 వేలు చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు ఓబయ్య, మేరి, రాములమ్మ, అనూష, వెంకటమ్మ, పాలక్క తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని