logo

హత్య కేసులో నిందితుల అరెస్టు

మైదుకూరు మండలం మిట్టమానుపల్లెలో ఈ నెల 11న హత్యకు గురైన ముద్దం శ్రీను హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందులో సూత్రదారులైన భార్య మల్లేశ్వరి, ఆమెతో అక్రమ సంబంధం కలిగిన అదే గ్రామానికి చెందిన ఎర్రిబోయిన శివశంకర్‌, హత్యకు సహకరించిన దొండపాటి రాజగోపాల్‌ను అరెస్ట్‌

Published : 23 Jan 2022 02:32 IST


నిందితులతో సీఐ బీవీ చలపతి, ఎస్సై సత్యనారాయణ

మైదుకూరు, న్యూస్‌టుడే: మైదుకూరు మండలం మిట్టమానుపల్లెలో ఈ నెల 11న హత్యకు గురైన ముద్దం శ్రీను హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందులో సూత్రదారులైన భార్య మల్లేశ్వరి, ఆమెతో అక్రమ సంబంధం కలిగిన అదే గ్రామానికి చెందిన ఎర్రిబోయిన శివశంకర్‌, హత్యకు సహకరించిన దొండపాటి రాజగోపాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీఐ బీవీ చలపతి శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం ఏడాదికాలంగా మల్లేశ్వరి శివశంకర్‌తో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు. విషయం తెలిసిన భర్త శ్రీను ఆమెను తరచూ కొట్టడం, వేధించడంతో విషయాన్ని శివశంకర్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇరువురు కలిసి శ్రీనును అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రాజగోపాల్‌ సహాయం తీసుకున్న శివశంకర్‌ మద్యం మత్తులో ఉన్న శ్రీనును మేకలకు ఆకు తీసుకొద్దామని చెప్పి సమీప కొండపైకి తీసుకెళ్తూ నిద్రమాతలు, గుళికలు కలిపిన శీతలపానీయం తాపించారు. మత్తుతో కిందపడి పోయిన శివశంకర్‌ను కట్టెతో కొట్టి హతమార్చారని తెలిపారు. హత్యకు బాధ్యులైన ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ రమణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని