logo

పనులు జరిగేనా...పాలు పొంగేనా!

కడప పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కొన్ని పూర్తయినా పేదల దరిచేరడంలేదు. టెండర్ల విధానంలో నిబంధనలు, పాలనా యంత్రాంగంలో కదలిక లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 9 ప్రాంతాల్లో పేద వర్గాలకు అత్యాధునిక వసతులతో

Published : 23 Jan 2022 02:32 IST

అసంపూర్తిగా టిడ్కో గృహసముదాయాలు


కడప నగరంలోని లక్ష్మీనగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లు

- ఈనాడు డిజిటల్‌, కడప పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు కొన్ని పూర్తయినా పేదల దరిచేరడంలేదు. టెండర్ల విధానంలో నిబంధనలు, పాలనా యంత్రాంగంలో కదలిక లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 9 ప్రాంతాల్లో పేద వర్గాలకు అత్యాధునిక వసతులతో పట్టణ ప్రాంతాల్లో 19,231 ఇళ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం తలపెట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పున, లబ్ధిదారులు 50 శాతం రుణ రూపంలో వెచ్చించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు రాష్ట్రంలో అధికార మార్పిడితో నిలిచిపోయాయి. 25 శాతం లోపు పనులను నిలిపివేయాలనే నిబంధన కింద జిల్లా యూనిట్‌గా తీసుకోగా పనులన్నీ ఆపేయాల్సి వచ్చిందని టిడ్కో అధికారులు చెపుతున్నారు. దీంతో నిర్మాణాలు దాదాపు పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల్లో అసంపూర్తి పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతుండగా జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. అత్యాధునిక నిర్మాణాలు నిర్వహణ లేక పాడైపోతుండడం గమనార్హం. n కడప నగరపాలక సంస్థ పరిధిలో మొదటి దశలో పారిశ్రామికవాడ లక్ష్మీనగర్‌ వద్ద జీ+3 ఆకృతితో 31 విభాగాల్లో 32 ఇళ్లు చొప్పున 992 ఇళ్ల నిర్మాణం చిన్నపాటి పనులు తప్ప పూర్తయ్యాయి. చలమా రెడ్డిపల్లె వద్ద రెండో దశ నిర్మాణాలు చేపట్టారు. విద్యుత్తు లైన్లు, నియంత్రికలు ఏర్పాటు చేయగా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం తదితర చిన్నపాటి పనులే మిగిలి ఉన్నాయి. n జమ్మలమడుగులో 1,440 గానూ 1,404 గృహాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇక్కడ ఒక బ్లాక్‌లో మాత్రమే 36 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. n ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటిలో కొంత వరకు పనులు జరిగాయి. n రాజంపేట, బద్వేలు, మైదుకూరులో నిధులు వెచ్చించనప్పటికీ పులివెందుల్లో మాత్రం రూ.కోటి వ్యయం చేశారు.

నివేదిక సమర్పించాం...

టిడ్కో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. నిర్మాణం చేపట్టిన గుత్తేదారే మిగిలిన పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతులు అవసరం. నిర్మాణం పూర్తయిన గృహాలు కేటాయింపునకు అసంపూర్తి పనులు సైతం పూర్తి చేయాల్సి ఉంది. - లీలాకృష్ణప్రసాద్‌, ఈఈ, టిడ్కో

భవన సముదాయాల నిర్మిత ప్రాంతాలు : 9

మూడు దశల్లో చేపట్టే ఇళ్ల యూనిట్లు : 19,231

నిర్మాణం ప్రారంభం : 13,744

ప్రాజెక్టు వ్యయం : రూ.1061.62 కోట్లు

నిధుల ఖర్చు : రూ.160.82 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని