logo

మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ

మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. కడప పోలీసు కార్యాలయ ఆవరణలోని పెన్నార్‌ సమావేశమందిరంలో శనివారం మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా పోలీసులకు పోలీసు క్యాంటీన్‌ ద్వారా రాయితీ

Published : 23 Jan 2022 02:32 IST


మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌, చిత్రంలో దిశ డీఎస్పీ వాసుదేవన్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. కడప పోలీసు కార్యాలయ ఆవరణలోని పెన్నార్‌ సమావేశమందిరంలో శనివారం మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా పోలీసులకు పోలీసు క్యాంటీన్‌ ద్వారా రాయితీ ధరలపై సరకులు సరఫరా చేస్తామని తెలిపారు. కొవిడ్‌కు గురైన సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు సేవలందించేందుకు దిశ ఠాణాలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ఉచితంగా వైద్య పరికరాలు అందిస్తామని వివరించారు. మహిళా పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు మహిళల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలని, యాప్‌పై విద్యార్థినులను చైతన్యపరచాలన్నారు. సమావేశంలో దిశ డీఎస్పీ వాసుదేవన్‌, సీఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని