logo

ట్రాన్స్‌కో క్రీడా పోటీలు ప్రారంభం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ట్రాన్స్‌కో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. కడప, చిత్తూరు జిల్లాల విద్యుత్తు ఉద్యోగులు పాల్గొంటున్న ఈ క్రీడా పోటీల్లో ఈనెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం స్థానిక డీఎస్‌ఏ మైదానంలో ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీరాములు

Published : 23 Jan 2022 02:32 IST


క్రికెట్‌ ఆడుతున్న ట్రాన్స్‌కో సీఈ శ్రీరాములు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ట్రాన్స్‌కో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. కడప, చిత్తూరు జిల్లాల విద్యుత్తు ఉద్యోగులు పాల్గొంటున్న ఈ క్రీడా పోటీల్లో ఈనెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం స్థానిక డీఎస్‌ఏ మైదానంలో ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అలసిపోయిన ఉద్యోగులకు ఈ క్రీడా పోటీలు ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. మూడు రోజులపాటు విద్యుత్తు ఉద్యోగులు సమస్యలన్నింటినీ మరిచిపోయి ఆనందంగా ఆటలాడాలన్నారు. కార్యక్రమంలో ఏఈఈ గోవిందురాజు, ఈఈఈ గిరిధర్‌, డీఈఈ శ్రీనాథుడు, ఈఈఈ గోవిందురాజు, మస్తాన్‌, వీరాంజనేయులు, వెంకటరమణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని