logo

విద్యుత్తు శాఖలో ఇంజినీర్ల బదిలీకి మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ పరిధిలో జిల్లాలో పనిచేసే ఇంజినీర్ల బదిలీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సంస్థ జిల్లా పర్యవేక్ష ఇంజినీరు శోభావాలెంటీనా మార్గదర్శకాలు జారీ చేశారు.

Published : 27 Jan 2022 01:45 IST

కడప గ్రామీణ, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ పరిధిలో జిల్లాలో పనిచేసే ఇంజినీర్ల బదిలీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సంస్థ జిల్లా పర్యవేక్ష ఇంజినీరు శోభావాలెంటీనా మార్గదర్శకాలు జారీ చేశారు. ఒకే ప్రాంతంలో మూడేళ్లు, ఆపైన పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావాలనుకునేవారికి సంస్థ కార్యాలయ పరిధి ఉన్నతాధికారులు బదిలీ చేస్తారు. స్పౌజ్‌, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా నిబంధనల నుంచి మినహాయించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగిన సమయంలోనే జిల్లాలోనూ బదిలీలు చేయాల్సి ఉంది. బద్వేలు, పురపాలక, స్థానిక ఎన్నికలు వరుసగా రావడం, వరదల కారణంగా బదిలీలు జరగలేదు. ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడంతో ప్రక్రియ ప్రారంభించారు. మూడేళ్లు, ఐదేళ్లు ఒకే చోట ఎందరు పనిచేస్తున్నారనే సమాచారాన్ని గురువారం అధికారులు ప్రకటించనున్నారు. అనంతరం ఆ జాబితాలో ఉన్న ఇంజినీర్లు ఫిబ్రవరి 1వ తేదీలోపు ఏ ప్రాంతానికి బదిలీ (ఆప్షన్లు) కావాలనేది రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీలోపు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తామని ఎస్‌ఈ శోభావాలెంటీనా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని