logo

‘మైనార్టీల ద్రోహి సీఎం జగన్‌’

మైనార్టీల ద్రోహిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మిగిలి పోయారని తెదేపా మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాహ్‌ అహ్మద్‌ అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో మైనార్టీ ముఖ్య నాయకులు, సోదరులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య

Published : 27 Jan 2022 01:45 IST


మాట్లాడుతున్న ముస్తాహ్‌ అహ్మద్‌ పక్కన ప్రవీణ్, ముక్తియార్‌

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: మైనార్టీల ద్రోహిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మిగిలి పోయారని తెదేపా మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాహ్‌ అహ్మద్‌ అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో మైనార్టీ ముఖ్య నాయకులు, సోదరులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ముస్తాహ్‌ అహ్మద్‌తో పాటు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దుల్హన్‌ పథకంలో రూ.లక్ష ఇస్తానని ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ అని దొంగ హామీ ఇచ్చారని దాని ప్రస్తావనే లేదన్నారు. రంజాన్‌ తోఫా జగన్‌ తీసేశారన్నారు. విదేశీ విద్య పేరుతో తెదేపా రూ.15 లక్షలు ఇస్తే దానిని కూడా తీసేశారన్నారు. శివాలయం కూడలి వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌ కూలకొట్టి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడ వ్యాపారం చేస్తున్న 80 శాతం మంది మైనార్టీల జీవనాధారంపై దెబ్బకొట్టారని ప్రవీణ్‌ ఆరోపించారు. మైనారిటీలకు తాను బిడ్డలా తోడుంటానని ఒక్కసారి ఆశీర్వదించి మద్దతు తెలపాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని