logo

రూ.56 కోట్లతో 13 వేల ఎకరాలకు సాగునీరు

వేముల, వేంపల్లె మండలాలకు మహర్దశ రానుంది. రెండు మండలాల్లోని 13,520 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.56.83 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులకు ఎంపీ

Published : 27 Jan 2022 01:45 IST

వేముల, న్యూస్‌టుడే: వేముల, వేంపల్లె మండలాలకు మహర్దశ రానుంది. రెండు మండలాల్లోని 13,520 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.56.83 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి గురువారం భూమిపూజ చేయనున్నారు. వేముల మండలంలోని పెండ్లూరు, వేంపల్లె మండలంలోని అలవలపాడు, నాగూరు చెరువులకు అలవలపాడు సమీపంలోని గాలేరు నగరి కాలువ ద్వారా నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి 1,571 ఎకరాలకు సాగునీరందించనున్నారు. దీంతోపాటు పీబీసీ నుంచి వేముల, వేంపల్లె మండలాల్లోని 11,950 ఎకరాలకు సాగునీరందించనున్నారు. వరదల సమయంలో చెరువులకు నీటిని నింపి పంటలకు సరఫరా చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని