logo

ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో

డీలర్‌షిప్‌ను తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారంటూ మైదుకూరు మండలం ఓబులాపురానికి చెందిన వైకాపా నాయకుడు మూలె వెంకట్రామిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక రోజులో సమస్యను పరిష్కరించకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి

Published : 29 Jan 2022 01:25 IST


మూలె వెంకట్రామిరెడ్డి

మైదుకూరు, న్యూస్‌టుడే : డీలర్‌షిప్‌ను తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారంటూ మైదుకూరు మండలం ఓబులాపురానికి చెందిన వైకాపా నాయకుడు మూలె వెంకట్రామిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక రోజులో సమస్యను పరిష్కరించకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి శుక్రవారం ఆయన విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యంలో చక్కర్లు కొట్టింది. తమకున్న తాత్కాలిక డీలర్‌షిప్‌ను ఎమ్మెల్యే తన బంధువులకు అప్పగించబోతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. న్యాయం చేయకపోతే వైకాపానే కారణమని ఉత్తరం రాసి చనిపోతానంటూ అందులో పేర్కొన్నారు. ఓబులాపురం తాత్కాలిక డీలర్‌గా సరస్వతమ్మ కొనసాగుతున్నారని తహసీల్దారు హేమంతకుమార్‌ తెలిపారు. సరకుల నిల్వలో తేడాలున్నందున కేసు నమోదు చేశామని, ప్రస్తుతం సరకులను తమ సిబ్బంది పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని