logo

లోకాయుక్త కేసుల్లో రెవెన్యూదే అగ్రస్థానం: జస్టిస్‌ లక్ష్మణరెడ్డి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా 5 వేల కేసులను విచారిస్తున్నామని, అందులో అత్యధికంగా 2 వేలకు పైగా రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు బుధవా

Published : 19 May 2022 03:54 IST


మాట్లాడుతున్న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా 5 వేల కేసులను విచారిస్తున్నామని, అందులో అత్యధికంగా 2 వేలకు పైగా రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు బుధవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కాగా అప్పట్నుంచి వెయ్యికి పైగా కొత్తకేసుల విచారణ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అన్యాయం జరిగినా తమకు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయం సెస్‌ వసూలు చేయించామని, సీనరేజీ ఛార్జీలను మండల, పంచాయతీ ఖాతాలకు జమ చేయించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని