logo

వ్యాయామ చికిత్సకు విరామం

భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల పిల్లలకు ఏడాదిలో 10 నెలల పాటు నిర్విరామంగా వ్యాయామ చికిత్స సేవలందిస్తుండగా, రెండు నెలలపాటు విరామమిచ్చారు. వ్యాయామచికిత్స సేవలకు సెలవులు ప్రకటించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి

Published : 20 May 2022 03:36 IST

 భవిత కేంద్రాల్లో సేవలకు తాత్కాలిక సెలవు 
 కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రుల వినతి 


ఒంటిమిట్టలోని భవిత కేంద్రం 

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల పిల్లలకు ఏడాదిలో 10 నెలల పాటు నిర్విరామంగా వ్యాయామ చికిత్స సేవలందిస్తుండగా, రెండు నెలలపాటు విరామమిచ్చారు. వ్యాయామచికిత్స సేవలకు సెలవులు ప్రకటించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో సొంత భవనాలున్న భవిత కేంద్రాలు 17 ఉన్నాయి. ప్రభుత్వ పక్కా భవనం లేని, అద్దె గదుల్లో నడిచేవి, బాడుగ మినహాయింపు ఉన్న మరో 34 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 27 మంది వ్యాయామ చికిత్స నిపుణుల ద్వారా బాలురు 473 మంది, బాలికలు 292 మంది సేవలు పొందుతున్నారు. పిల్లల్లో చాలామంది శారీరకంగా కీళ్లు, నరాల సమస్యతో బాధపడు తుండగా, నడవలేక, కూర్చోలేని వారికి ప్రత్యేకంగా వారంలో ఒకరోజు నిపుణుల ద్వారా వ్యాయామచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిధుల కొరతతో కొన్నేళ్లుగా ఏటా వేసవిలో మే, జూన్‌ రెండు నెలలపాటు సేవలు నిలిపివేస్తున్నారు. ఈ రెండు నెలల్లో కనీసం వారాంతంలో ఒకసారి సేవలందించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర విధానం కావడంతో జిల్లాలో తాత్కాలికంగా విరామం అమలు చేస్తున్నామని సమగ్ర శిక్ష యంత్రాంగం చెబుతోంది. ప్రైవేటుగా చేయించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడంతవుతుందని  తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రమం తప్పకుండా పిల్లలకు వ్యాయామ చికిత్స చేయించాలని తల్లిదండ్రుల నుంచి అభ్యర్థనలొస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, వారు అనుమతిస్తే కొనసాగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని