logo

భూ సర్వే పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణలో భాగంగా  రీసర్వే పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ ఆదేశించారు. విజయవాడ నుంచి దృశ్యమాధ్యమంలో గురువారం కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మతో ఆయన సమీక్షించారు.

Published : 20 May 2022 03:36 IST


 దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణలో భాగంగా  రీసర్వే పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ ఆదేశించారు. విజయవాడ నుంచి దృశ్యమాధ్యమంలో గురువారం కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కార్యాచరణ, అమలుపై సమీక్షించి పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో 735 గ్రామాలకుగానూ 96 గ్రామాల్లో డ్రోన్‌ప్లై ప్రక్రియ పూర్తయిందన్నారు. మరో 68 గ్రామాలకు ఆర్థో ఇమేజెస్‌ సాఫ్ట్, హార్డు కాపీలను కూడా తీశామన్నారు. మరో రెండు గ్రామాల హ్యాబిటేషన్లలో 13వ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన భూముల్లో స్వచ్ఛీకరణ ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని