logo

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

మండల కేంద్రంలోని చెన్నూరులోని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరులోని బెస్తకాలనీలో ఉండే గుడి వంశీ(22) అనే యువకుడు కొంత కాలంగా మద్యానికి

Published : 20 May 2022 03:36 IST

చెన్నూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని చెన్నూరులోని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరులోని బెస్తకాలనీలో ఉండే గుడి వంశీ(22) అనే యువకుడు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో చీరతో పంకాకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని