logo

ఆర్‌బీకే పేరు మార్పు!

రైతులకు అన్నివిధాలా అభయం ఇవ్వాలనే సదాశయంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఎంపిక చేశారు. తాత్కాలిక వసతులు కల్పించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం  నూతన భవనాల నిర్మాణానికి అనుమతిచ్చారు.

Updated : 22 May 2022 02:48 IST

 ‘వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనం’గా నమోదు
 కేంద్రప్రభుత్వం ఆదేశాలతో పీఆర్‌శాఖ చర్యలు 


నాడు: ఒంటిమిట్టలో డా. వై.యస్‌.ఆర్‌ రైతు భరోసా కేంద్రంగా నమోదు... 

 న్యూస్‌టుడే, కడప రైతులకు అన్నివిధాలా అభయం ఇవ్వాలనే సదాశయంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఎంపిక చేశారు. తాత్కాలిక వసతులు కల్పించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం  నూతన భవనాల నిర్మాణానికి అనుమతిచ్చారు. మొదట పూర్తయిన వాటికి డా.వైయస్‌ఆర్‌ ‘రైతు భరోసా కేంద్రం’గా నమోదు చేసి రాయించి ఘనంగా ప్రారంభించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది కావడంతో కథ అడ్డం తిరిగింది. ఆర్‌బీకే పేరు స్థానంలో ‘వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కేంద్రం’గా మార్పు చేశారు.* ఉమ్మడి కడప జిల్లాలోని గ్రామాల్లో 620, పట్టణాల్లో 19 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల 2020, మే 30వ తేదీ నుంచి సేవలు అందుబాటులోకొచ్చాయి. ఆయా భవనాలపై రాసిన డా.వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రం పేర్లపై ఇటీవల కేంద్రం అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. భవనాల నిర్మాణానికి నరేగా నిధులు 90 శాతం వినియోగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారార్భాటం చేసుకోవడంపై ఆక్షేపించినట్లు తెలిసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మాణ పనులను పర్యవేక్షించిన పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రంగంలోకి దిగి ‘డా.వైయస్‌ఆర్‌. రైతు భరోసా కేంద్రం’ పేరును తొలగిస్తున్నారు. కొత్తగా ‘వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనం’గా పేర్లు రాయిస్తున్నారు. కేంద్రాల ద్వారా గతంలో మాదిరిగానే సేవలందిస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన భవనాలకు ‘రైతు భరోసా కేంద్రం’గా రాయించామని, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనం’గా మార్పు చేస్తున్నామన్నారు. 


నేడు:  వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనంగా మార్పు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు