logo

వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉండాలి : కలెక్టర్‌

వ్యవసాయం రైతులకు లాభసాటి కావాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ సలహామండలి జిల్లా ఛైర్మన్‌ ప్రసాదరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో

Published : 22 May 2022 04:06 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, చిత్రంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ అమరనాథ్‌రెడ్డి,
వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి, జిల్లా ఛైర్మన్‌ ప్రసాదరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : వ్యవసాయం రైతులకు లాభసాటి కావాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ సలహామండలి జిల్లా ఛైర్మన్‌ ప్రసాదరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌తోపాటు జడ్పీ ఛైర్మన్‌ అమరనాథరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ సలహాదారు కృష్ణా రెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు విస్తృత సేవలందిస్తున్నామని,. వీటితో పాటు అగ్రిల్యాబుల సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. ఖరీఫ్‌లో సాగునీరందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జేసీ మాట్లాడుతూ ఖరీఫ్‌లో 78,095 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మొత్తం 432 పొలంబడి యూనిట్లలో రైతులకు వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలివ్వడంతోపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు. జడ్పీ ఛైర్మన్‌ అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ విత్తనం, ఎరువు, పురుగు మందులు ఎంతమేర అవసరమనే వివరాలు ప్రతినెలా జిల్లాస్థాయి సమీక్షలో తెలపాలన్నారు. అనంతరం జిల్లా ఛైర్మన్‌ ప్రసాదరెడ్డి పలు సూచనలిచ్చారు. సమావేశంలో డీఏవో నాగేశ్వరరావు, ఆత్మ పీడీ విజయ కుమారి, విద్యుత్తుశాఖ ఎస్‌ఈ శోభావాలెంటీనా, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటరమణ, ఏపీఎంఐపీ పీడీ మధుసూదనరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు