logo

ప్రారంభానికి ముందే శిథిలం

చేనేత కార్కికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మైలవరంలో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 2005, మే 24న శిలాఫలకం వేశారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో రూ.7.9 కోట్లతో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో

Published : 22 May 2022 04:06 IST


మైలవరంలో టైక్స్‌టైయిల్‌ పార్కు భవనాలు

చేనేత కార్కికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మైలవరంలో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 2005, మే 24న శిలాఫలకం వేశారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో రూ.7.9 కోట్లతో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 62.18 ఎకరాల్లో భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో గత 17 ఏళ్లుగా పార్కు భవనాలు నిరుపయోగంగా మారాయి. సామగ్రి చెల్లాచెదురు కాగా, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పరిపాలనా గదులను పశువుల కాపర్లు వాడు కుంటుండడం గమనార్హం. పార్కును ప్రారంభిస్తే దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం, మోరగుడి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని నేత కార్మికులతోపాటు అద్దకం పరిశ్రమలపై ఆధారపడ్డ ఉత్పత్తిదారులకు ఎంతో ఉపయోగకరం. పార్కులో మొత్తం 118 ప్లాట్లు ఏర్పాటు చేయగా, 43 ప్లాట్లు పొందేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అడ్వాన్సుల రూపంలో రూ.8.86 లక్షలు చెల్లించారు. మిగిలిన 75 ప్లాట్లు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. రూ.కోట్లు వ్యయం చేసినా ఈ పార్కు నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. - ఈనాడు, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని