logo

‘ఇళ్ల కూల్చివేత ఆపకుంటే ఉద్యమిస్తాం’

‘40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాం. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నీటి, ఇంటి పన్నులు అక్కడి నుంచే చెల్లిస్తున్నాం. ఇంతవరకు అడ్డురాని ఇళ్లు ఇప్పుడు వైకాపా నాయకుల స్థలాలకు ఇబ్బందులు వస్తాయని పేదల బతుకులను రోడ్డుకీడుస్తారా. ఇది సరికాదు’

Published : 22 May 2022 04:06 IST


కలెక్టర్‌ విజయరామరాజుకు వినతిపత్రమిస్తున్న ఐకాస నేతలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : ‘40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాం. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నీటి, ఇంటి పన్నులు అక్కడి నుంచే చెల్లిస్తున్నాం. ఇంతవరకు అడ్డురాని ఇళ్లు ఇప్పుడు వైకాపా నాయకుల స్థలాలకు ఇబ్బందులు వస్తాయని పేదల బతుకులను రోడ్డుకీడుస్తారా. ఇది సరికాదు’ అని ఐకాస నాయకులు అన్నారు. ఇళ్ల కూల్చివేత ఆపకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఐకాస నేతలు అమీర్‌బాబు, సత్తార్, తిరుమలేష్, జక్కరయ్య, లక్ష్మీరెడ్డి బాలకృష్ణయాదవ్, బాలదాసు, శివకొండారెడ్డి, పద్మావతీబాయి, జయకుమార్, మగ్బుల్‌బాషా తదితరులు కడప ఎన్టీఆర్‌నగర్, ప్రకాశ్‌నగర్, ఏఆర్పీకాలనీ వాసులతో కలిసి కలెక్టర్‌ విజయరామరాజుకు శనివారం వినతిపత్రం అందించారు. వైకాపా నాయకుల స్థలాలకు గిరాకీ కల్పించేందుకు తహసీల్దారు పదే పదే ఇళ్ల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఐకాస నాయకులు శాంతయ్య, గుర్రప్ప, నాగేంద్రబాబు, కల్యాణ్‌రాం, దావుద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.* ఇదే అంశంపై కడప ఆర్డీవో ధర్మాచంద్రారెడ్డికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ వినతిపత్రం అందించి పేదల సమస్యలు విన్నవించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని