logo

రాయలసీమ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు 5న

రాయలసీమ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు జూన్‌ 5న కర్నూలులోని బీఆర్‌.అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకులు కుంచం వెంకటసుబ్బారెడ్డి వెల్లడించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన పత్రాలను శనివారం

Published : 22 May 2022 04:06 IST


ప్లీనరీ సమావేశానికి సంబంధించిన పత్రాలను ఆవిష్కరిస్తున్న కుంచం వెంకటసుబ్బారెడ్డి తదితరులు

కడప(చిన్నచౌకు), న్యూస్‌టుడే : రాయలసీమ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు జూన్‌ 5న కర్నూలులోని బీఆర్‌.అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకులు కుంచం వెంకటసుబ్బారెడ్డి వెల్లడించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన పత్రాలను శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్‌ జిల్లాలతో కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. రాయలసీమపై ముఖ్యమంత్రి తన వైఖరి ప్రకటించాలన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం మోపారని ఆరోపించారు. రాయలసీమ బాగుకోరే వారందరూ ప్లీనరీ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, కృష్ణ, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని