logo

వివాహం కాలేదని యువకుడి ఆత్మహత్య

వివాహం కాలేదని ఓ యువకుడు మనస్తాపంతో లింగాల కుడి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్నపల్లెలో చోటు చేసుకుంది. ఎస్సై హృషికేశ్వరరెడ్డి వివరాల ప్రకారం... అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తురకవారిపల్లెకు చెందిన

Published : 22 May 2022 04:06 IST

లింగాల, న్యూస్‌టుడే: వివాహం కాలేదని ఓ యువకుడు మనస్తాపంతో లింగాల కుడి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్నపల్లెలో చోటు చేసుకుంది. ఎస్సై హృషికేశ్వరరెడ్డి వివరాల ప్రకారం... అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తురకవారిపల్లెకు చెందిన కె.నాగార్జున (30) పెళ్లి కావట్లేదని తరచూ మనోవేదనకు గురయ్యేవాడు. ఇదే క్రమంలో గత శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం పీబీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న కుడికాల్వలో మృతదేహం కొట్టుకురాగా గ్రామస్తులు  పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని