logo

గృహనిర్మాణాల్లో ప్రగతి సాధించాలి : కలెక్టర్‌

జగనన్న గృహనిర్మాణ కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణ పనులతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని

Published : 24 May 2022 06:20 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, చిత్రంలో జేసీ సాయికాంత్‌వర్మ,
డీఆర్వో మాలోల, గృహనిర్మాణ శాఖ పీడీ కృష్ణయ్య

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జగనన్న గృహనిర్మాణ కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణ పనులతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని, ప్రతి ఇంటికీ చెత్తబుట్టలు అందజేసి, ఘన, వ్యర్థాల సేకరణ, వర్మీకంపోస్టు నిర్వహణ ప్రణాళికాబద్ధంగా జరిగేవిధంగా చూడాలన్నారు. మండలానికి ఒక మోడల్‌ గ్రామాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో, ప్రతి వారం ఒక గ్రామాన్ని తనిఖీ చేస్తామన్నారు. జేసీ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ...కొవిడ్‌ టీకా ప్రక్రియ సక్రమంగా జరగాలని, ప్రతి సచివాలయ పరిధిలో ఫీవర్‌ సర్వే నిర్వహించాలన్నారు. అంతకుముందు ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమావేశంలో డీఆర్వో మాలోల, గృహనిర్మాణశాఖ పీడీ కృష్ణయ్య, జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక కలెక్టర్‌ రామ్మోహన్, అడా వైస్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మీ, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు మధుసూదన్‌రెడ్డి, యదు భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని