logo

జడ్‌హెచ్‌డీసీ భూములపై అక్రమార్కుల కన్ను

మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ పొలంలో జిల్లా హరిజనాభివృద్ధి సంస్థ (జడ్‌హెచ్‌డీసీ) భూములపై కొందరి కన్ను పడింది. భాగ్యనగరం సమీపంలో కమలాపురానికి చెందిన వ్యక్తి ఒకరు ఖాజీపేట-తువ్వపల్లె కూడలి రహదారి పక్కనే దాదాపు ఐదెకరాల

Published : 24 May 2022 06:20 IST


భాగ్యనగరం వద్ద చదును చేసిన ప్రాంతం

మైదుకూరు, న్యూస్‌టుడే: మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ పొలంలో జిల్లా హరిజనాభివృద్ధి సంస్థ (జడ్‌హెచ్‌డీసీ) భూములపై కొందరి కన్ను పడింది. భాగ్యనగరం సమీపంలో కమలాపురానికి చెందిన వ్యక్తి ఒకరు ఖాజీపేట-తువ్వపల్లె కూడలి రహదారి పక్కనే దాదాపు ఐదెకరాల మేర భూమిని డోజరుతో చదును చేయించే పనిలో నిమగ్నమయ్యారు. నంద్యాలంపేట, వరదాయపల్లె, గాంధీనగర్, కొత్త గంగవరం, భాగ్యనగరం ప్రాంతంలో 441.86 ఎకరాల్లో జడ్‌హెచ్‌డీసీ భూములు ఉన్నాయి. గతంలో ఈ భూములును కొందరు ఎస్సీలకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. లీజు గడువు ముగిసిపోవడంతో భాగ్యనగరం సమీపంలోని భూములు బీడుగా ఉన్నాయి. ఇప్పటికే కొందరు భూముల కోసం జడ్‌హెచ్‌డీసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగా కమలాపురం వాసి ఒకరు రెండ్రోజులుగా డోజర్‌తో పనులు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై తహసీల్దారు ప్రేమంతకుమార్‌ మాట్లాడుతూ జడ్‌హెచ్‌డీసీ భూములను ఎవరికీ లీజుకు ఇవ్వలేదని వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీకి వెళ్లిన వీఆర్వో వెంకటసుబ్బయ్యను చూసిన ఆక్రమణదారుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయినట్లు పేర్కొన్నారు. భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని