logo

పురపాలక అభియోగాల్లో ఇద్దరు గుత్తేదారుల అరెస్టు

మైదుకూరు పురపాలక సంఘంలో పనులు చేయకుండా గుత్తేదారులకు నిధులు చెల్లించారనే అభియోగాలపై మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో సోమవారం ఇద్దరు గుత్తేదారులను అరెస్టు చేశారు. మైదుకూరుకు

Published : 24 May 2022 06:20 IST

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పురపాలక సంఘంలో పనులు చేయకుండా గుత్తేదారులకు నిధులు చెల్లించారనే అభియోగాలపై మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో సోమవారం ఇద్దరు గుత్తేదారులను అరెస్టు చేశారు. మైదుకూరుకు చెందిన చక్రవరం విద్యాసాగర్, సయ్యద్‌ ముజఫర్‌లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎస్‌.ఆర్‌.వంశీధర్‌గౌడ్‌ తెలిపారు. పురపాలక సంఘంలో 2016-17లో జరిగిన పనుల్లో రూ.71,04,766 మేర నిధుల దుర్వినియోగానికి సంబంధించి మార్చి 15న కేసు నమోదు కాగా, విచారణ చేపట్టి ఏప్రిల్‌ 6న అప్పట్లో పనిచేసిన కమిషనర్‌ శ్రీనివాసులు, ఏఈ నరసింహులును అరెస్టు చేశామని డీఎస్పీ వెల్లడించారు. విచారణలో మరికొందరు గుత్తేదారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని, పూర్తిస్థాయి విచారణతో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. పురపాలక సంఘంలోని మిగిలిన వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులపై కూడా ఆరా తీయనున్నటు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని