logo

రైతుబజారులో కిలో రూ.65కు టమోటాల విక్రయం

బహిరంగ మార్కెట్‌లో టమోటా ధరలు ఆకాశన్నంటడంతో ప్రభుత్వం బయట కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయిస్తోంది. కడప రైతు బజారులో బుధవారం నుంచి రూ.65కే టమోటాలను విక్రయిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మార్కెటింగ్‌శాఖ ప్ర

Published : 26 May 2022 06:34 IST


రైతుబజారులో టమోటాల విక్రయాన్ని పరిశీలిస్తున్న మార్కెటింగ్‌శాఖ ఏడీ హిమశైల

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: బహిరంగ మార్కెట్‌లో టమోటా ధరలు ఆకాశన్నంటడంతో ప్రభుత్వం బయట కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయిస్తోంది. కడప రైతు బజారులో బుధవారం నుంచి రూ.65కే టమోటాలను విక్రయిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన టమోటాలను అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాలకు పంపారు. వైయస్‌ఆర్‌ జిల్లాకు 4,900 కిలోలు వచ్చాయి. వచ్చిన వాటిని రైతు బజారుల్లో విక్రయిస్తున్న వారందరికి టమోటాలను అందజేసి వారితో విక్రయించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం టమోటాల విక్రయాన్ని మార్కెటింగ్‌శాఖ ఏడీ హిమశైల పరిశీలించారు. కడపకు వచ్చిన టమోటాల్లో 25 బాక్సులను ఎర్రగుంట్ల రైతుబజారుకు పంపామని ఏడీ తెలిపారు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు రైతుబజారులో టమోటాలు అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీ కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని