logo

చైతన్య పరచడమే ప్రజానాట్య మండలి లక్ష్యం

ప్రజా నాట్యమండలి ఆశయ సాధనకు కళాకారులు పునరంకితం కావాలని ఏపీ ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గని, చంద్రానాయక్‌ పేర్కొన్నారు.  ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభల్లో భాగంగా కడప కళాక్షేత్రంలో బుధవారం వ్యవస్థాపక

Published : 26 May 2022 06:34 IST


 జెండాను ఆవిష్కరిస్తున్న ఏపీ ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు గని

మారుతీనగర్‌(కడప), న్యూస్‌టుడే : ప్రజా నాట్యమండలి ఆశయ సాధనకు కళాకారులు పునరంకితం కావాలని ఏపీ ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గని, చంద్రానాయక్‌ పేర్కొన్నారు.  ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభల్లో భాగంగా కడప కళాక్షేత్రంలో బుధవారం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి, చైతన్యం కోసం ప్రజా నాట్య మండలి గత 79 ఏళ్లుగా అవిశ్రాంత కృషి చేస్తోందన్నారు. పాలకులు ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కోలాటం, చెక్కభజన, కర్రసాము, కత్తి విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిచ్చయ్య, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, చంద్ర, అంకుశం, విశ్వనాథ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని