logo

ఖైదీలకు ఆరోగ్యశ్రీ అమలుకు ప్రయత్నం

రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సంస్కరణల అమలు తీరు బాగుందని కితాబిచ్చారు. కడప నగర సమీపంలోని

Published : 26 May 2022 06:34 IST

జైళ్లశాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సంస్కరణల అమలు తీరు బాగుందని కితాబిచ్చారు. కడప నగర సమీపంలోని ప్రత్యేక మహిళా కారాగారంలో ఓ విచారణ నిమిత్తం బుధవారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 పెట్రోలు బంకులు నడుస్తున్నాయని, ఖైదీల ఆధ్వర్యంలో మొదటి పెట్రోలు బంకు కడపలోనే ఏర్పాటు చేశామన్నారు. వార్డర్లను సొంత జిల్లాలకు కేటాయించడంలో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయని, దానిపై ఆలోచిస్తున్నామన్నారు. 2021, ఆగస్టులో ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే ఖైదీల విడుదల ఉంటుందని ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని