logo

త్వరలో విద్యాశాఖ నియంత్రణలోకి పురపాలక బడులు : ఎమ్మెల్సీ

రాష్ట్రప్రభుత్వం త్వరలో విద్యాశాఖ పరిధిలోకి పురపాలక పాఠశాలలను తీసుకొచ్చే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం దస్త్రం పురపాలకశాఖ మంత్రి వద్ద ఉందని,

Published : 26 May 2022 06:34 IST

కడప విద్య, న్యూస్‌టుడే : రాష్ట్రప్రభుత్వం త్వరలో విద్యాశాఖ పరిధిలోకి పురపాలక పాఠశాలలను తీసుకొచ్చే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం దస్త్రం పురపాలకశాఖ మంత్రి వద్ద ఉందని, త్వరలో ఉత్తర్వులు రానున్నాయన్నారు. శాసన మండలి సభ్యులందరూ కోరిన విధంగానే పురపాలక పాఠశాలల దీర్ఘకాలిక సమస్యలైన ఉద్యోగోన్నతులు, బదిలీలు, డీడీవో అధికారాలు రానున్నాయని పేర్కొన్నారు. కడపలో ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులకు వేతన స్థిరీకరణ, మైనార్టీ పాఠశాలలను విలీనం నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని