logo

పత్తి అధరహో.!

పత్తి దిగుబడికి ఈ సంవత్సరం ఆశించినమేర ధర పలికింది. గతంలో ఎన్నడులేని విధంగా రాబడికి మార్గం ఏర్పడింది. క్వింటా రూ.13,676 చేరుకుందని వ్యాపారులు అంటున్నారు. నాణ్యతను బట్టి తొలుత రూ.10 వేల నుంచి రూ.12,500 వరకు కొనుగోల్లు చేసినట్లు

Published : 26 May 2022 06:34 IST

క్వింటా రూ.13.676 అత్యధికం 
 మిల్లులకు చేరిన దిగుబడులు


దిగుబడులను లోడ్‌ చేస్తున్న కూలీలు 

 న్యూస్‌టుడే, రాజుపాళెం పత్తి దిగుబడికి ఈ సంవత్సరం ఆశించినమేర ధర పలికింది. గతంలో ఎన్నడులేని విధంగా రాబడికి మార్గం ఏర్పడింది. క్వింటా రూ.13,676 చేరుకుందని వ్యాపారులు అంటున్నారు. నాణ్యతను బట్టి తొలుత రూ.10 వేల నుంచి రూ.12,500 వరకు కొనుగోల్లు చేసినట్లు రైతులు చెపుతున్నారు. అయితే ఆదోని మార్కెట్‌లో గిట్టుబాటు ధర క్వింటా రూ.13,676 ధర వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం కొనుగోళ్లు కొంతవరకు మందంగా ఉన్నాయి. దీంతో కొత్త పత్తి దిగుబడులు రావడంతో ధర కొంతవరకు తగ్గినా క్రమేనా పెరిగిందటున్నారు. పదేళ్ల క్రితం క్వింటా రూ.7,300 ధర పలికింది. మళ్లీ తగ్గి క్వింటా రూ.3,700 పడిపోయింది. దీంతో రైతులు చాలామంది తీవ్రంగా నష్ట పోయారు. గత నాలుగు నెలలుగా దిగుబడులు బాగా వస్తుండడంతో మార్కెట్‌ ప్రారంభంలో క్వింటా రూ.6,000 పలికింది. క్రమేనా ధర క్వింటా 10,000 వేలకు చేరింది. మళ్లీ ప్రస్తుతం పెరిగింది. దీంతో చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో మండలంలో 100 లారీలపైగా తరలాయి. గడచిన సంవత్సరాల్లో తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. గత నాలుగు రోజులుగా ధర పెరుగుతూ వచ్చిందని అంటున్నారు. గత చరిత్రలో పరిశీలించుకుంటే ఇంత ధర పలకడం ఇదే ప్రథమమని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఖరీఫ్‌లో పత్తి పంటను జిల్లాలో 55 వేల ఎకరాలలో సాగు చేశారు. అయితే అధిక వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో అరకొరగా దిగుబడులు వచ్చేవి. రాజుపాళెం మండలంలో 4 వేల ఎకరాలకుపైగా గత ఏడాది పత్తి పంట సాగు చేశారు. ఈ పత్తి దిగుబడులను కర్ణాటకలోని రాయచూరు, రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని ఆదోని, గుంటూరు ప్రాంతాలకు దిగుబడులను తరలించుతున్నారు. మార్కెట్‌లో అనుకున్నంత నిల్వలు లేకపోవడంతో క్వింటాకు ధర పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.13,676 పైగా క్వింటా ధర ఆకాశం ఎత్తు పెరిగింది. దీంతో రైతుల వద్ద అక్కడక్కడ మాత్రమే సరకు ఉంది. చాలావరకు మిల్లుల వద్దకు చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని