logo

పీడిత వర్గాల గొంతుక ప్రజానాట్యమండలి

పీడిత ప్రజల గొంతుక ప్రజా నాట్యమండలి అని సినీ నటుడు మాదాల రవి అన్నారు. కడప నగరంలో గురువారం ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కడప నగరంలోని జడ్పీ కార్యాలయం నుంచి కళాక్షేత్రం వరకు

Published : 27 May 2022 06:07 IST

కడప నగరంలో ప్రజానాట్య మండలి కళాకారుల ర్యాలీ

మారుతీనగర్‌(కడప), న్యూస్‌టుడే : పీడిత ప్రజల గొంతుక ప్రజా నాట్యమండలి అని సినీ నటుడు మాదాల రవి అన్నారు. కడప నగరంలో గురువారం ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కడప నగరంలోని జడ్పీ కార్యాలయం నుంచి కళాక్షేత్రం వరకు వేలాది మంది కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదాల రవి, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు బాబ్జీ, నల్లూరి వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పీజే ప్రభాకర్‌రావు మాట్లాడారు. వామ పక్షాలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలపై దాడులు, వ్యవసాయ, ఉద్యోగ సమస్యలు, కార్మిక, కర్షక సమస్యలపై ప్రజానాట్యమండలి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా తన వంతు ప్రయత్నం చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్న పీడిత వర్గాల కోసం ప్రజానాట్యమండలి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు ఏళ్లుగా ప్రజానాట్యమండలి అలుపెరుగని పోరాటాలు చేస్తోందని కొనియాడారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన కళాకారులు పాటలు పాడుతూ, డప్పులు వాయిస్తూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి గని, చంద్రా నాయక్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు బాలచంద్ర, నాగసుబ్బారెడ్డి, మద్దిలేటి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఐక్యత చాటుతున్న ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని