logo

ప్రభుత్వ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాచమల్లు దోపిడీ

పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రొద్దుటూరుకు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదురెడ్డి దోపిడీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి విమర్శించారు. గురువారం నెహ్రూరోడ్డులోని తన కార్యాలయంలో

Published : 27 May 2022 06:07 IST

మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆరోపణ

పాత శిలఫలాకం మళ్లీ ఏర్పాటు చేస్తామంటున్న

మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రొద్దుటూరుకు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదురెడ్డి దోపిడీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి విమర్శించారు. గురువారం నెహ్రూరోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టరు, ఇంజినీర్ల నుంచి పర్సెంటేజి తన జేబులోకి రాగానే కామనూరులో కొత్త పీహెచ్‌సీ భవనం సంగతి ఎమ్మెల్యేకు తెలిసిందన్నారు. ఎక్కడైనా భూములు కబ్జా జరిగితే తనకు ఫిర్యాదు చేయాలని చెబుతున్న రాచమల్లు, ఆయన అన్న.. ఇద్దరు కబ్జాదారులుగా ఉన్నారని ఆరోపించారు. కామనూరు పీహెచ్‌సీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంలో ప్రొటోకాల్‌ ప్రకారం తెదేపా ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, దేవగుడి శివనాథరెడ్డి పేర్లు లేకపోవడాన్ని తప్పుబట్టారు.ఫ నాడు-నేడు కింద కొత్తగా ముస్తాబైన పీహెచ్‌సీ ప్రారంభోత్సవం సందర్భంగా పాత శిలాఫలకాన్ని అక్కడే ఏర్పాటు చేసి తీరుతామని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తన కుటుంబం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా పోటీ చేస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు వరదరాజులురెడ్డి బదులిచ్చారు.

డీఆర్వో ఆమోదంతోనే శిలాఫలకంలో పేర్లు.. : ప్రొటోకాల్‌ ప్రకారం డీఆర్వో ఆమోదం ఉన్న పేర్లు శిలాఫలకంలో నమోదు చేశామని ర భ ఈఈ నరసింహారెడ్డి గురువారం తెలిపారు. ప్రొటోకాల్‌ అనుసరించి తెదేపా ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, దేవగుడి శివనాథరెడ్డి పేర్లు శిలాఫలకంలో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రస్తావించిన విషయంపై ‘న్యూస్‌టుడే’ అడిగిన వివరణకు ఈఈ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని