logo

సెల్‌ టవర్లకు సోలార్‌ ప్యానెళ్లు

విద్యుత్తు కోతలు, బిల్లుల మోతతో పలు కంపెనీలు సంప్రదాయేతర ఇంధన వనరులపై చూపు మళ్లిస్తున్నాయి. అందుకనుగుణంగా ఆలోచన చేసి చర్యలు చేపట్టాయి. పవర్‌ హాలిడే సమయంలో టెలికం కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చివరకు

Published : 27 May 2022 06:07 IST

కమలాపురంలో టవర్‌ వద్ద సోలార్‌ ప్యానల్‌

ఈనాడు డిజిటల్‌, కడప: విద్యుత్తు కోతలు, బిల్లుల మోతతో పలు కంపెనీలు సంప్రదాయేతర ఇంధన వనరులపై చూపు మళ్లిస్తున్నాయి. అందుకనుగుణంగా ఆలోచన చేసి చర్యలు చేపట్టాయి. పవర్‌ హాలిడే సమయంలో టెలికం కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చివరకు సెల్‌ టవర్లను సైతం జనరేటర్లతో నడపాల్సి వచ్చింది. సాధారణంగా కరెంటు పోయినా టవర్లు పని చేసేవిధంగా వాటికి బ్యాటరీలు అమర్చారు. ఇవి 3 గంటల్లో ఛార్జింగ్‌ అయితే విద్యుత్తు సరఫరా లేనప్పుడు 2 గంటలు యంత్ర పరికరాలు నడిస్తాయి. పవర్‌ హాలిడేతో రెండు రోజులు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బ్యాటరీలు ఛార్జింగ్‌ కోల్పోయాయి. ఈ విధంగా అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో పలుచోట్ల సెల్‌ టవర్లు పనిచేయక నెట్‌వర్క్‌ స్తంభించింది. దీంతో జనరేటర్ల సాయంతో ఛార్జింగ్‌ చేయించారు. కొన్ని చోట్ల జనరేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఛార్జింగ్‌ చేయించలేకపోయారు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలలోనూ సమస్య తలెత్తుతోంది. మొబైల్‌ ప్రొవైడర్లతో పాటు బ్యాంకులు సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో టవర్ల వద్ద టెలికం కంపెనీలు సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశాయి. ఏటీఎంల వద్ద ఏర్పాటుకు పలు బ్యాంకులు సన్నాహాలు చేస్తూ టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని