logo

‘బస్సు యాత్ర అప్రతిష్టపాలు చేయడమే వారి అజెండా’

తెలుగుదేశం, జనసేన పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి అజెండాను అమలు చేస్తున్నాయని జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, నగర మేయర్‌ సురేష్‌బాబు ఆరోపించారు. గురువారం వైకాపా

Published : 27 May 2022 06:07 IST

మాట్లాడుతున్న మేయర్‌ సురేష్‌బాబు, పక్కన జడ్పీ ఛైర్మన్‌

అమరనాథ్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ తదితరులు

కడప నగరపాలక, న్యూస్‌టుడే : తెలుగుదేశం, జనసేన పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి అజెండాను అమలు చేస్తున్నాయని జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, నగర మేయర్‌ సురేష్‌బాబు ఆరోపించారు. గురువారం వైకాపా జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మంత్రుల బస్సు యాత్రను అప్రతిష్టపాలు చేయడానికి అమలాపురం అల్లర్ల అజెండాను తెదేపా, జనసేన నాయకులు అమలుచేశారని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టి, ఆ పని చేసింది అధికార పార్టీ నాయకులేనని ప్రచారం చేయడం తగదన్నారు. పోలీసులు సంయమనం పాటించడం వల్లే అక్కడ ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. అల్లర్లను ఆపడానికి పోలీసులు కాల్పులు జరిపి ఉంటే పలువురు ప్రాణాలు కోల్పోయేవారన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే దానిపై రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని, ఆ పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించుకున్నారన్నారు. వైకాపా కార్యకర్తలు వారి నాయకుల ఇళ్లను వారే తగలబెడతారా అని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టలేదన్నారు. ఆయన గౌరవార్థం కోనసీమ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు. ఈ నిర్ణయంపైన ప్రభుత్వానికి పునరాలోచన లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు గడికోట మోహన్‌రెడ్డి, అఫ్జల్‌ఖాన్‌, సంబటూరు ప్రసాదరెడ్డి, తాగ్యరాజు, గరుడాద్రి,. వినోద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని