logo
Published : 27/11/2021 03:28 IST

తాడికల్‌ రహదారిపై ప్రమాదం

ఒకరి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

మృతిచెందిన జగన్‌

శంకరపట్నం,న్యూస్‌టుడే: తాడికల్‌ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌  వెళ్తున్న  ప్యాసింజర్‌ ఆటోను తాడికల్‌ వద్ద ప్రధాన రహదారిపై వెనకాల నుంచి ట్రాలీ ఆటో అతి వేగంగా ఢీకొట్టగా ఆటో పల్టీలు కొడుతూ రహదారి పక్క విద్యుత్తు స్తంభానికి వేగంతో తాకి కింద పడింది. విద్యుత్తు స్తంభం విరిగి పోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన కలేషా సుశీల, అంబాల నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి.  ట్రాలీ ఆటో నడుపుతున్న  జమ్మికుంటకు చెందిన తాడ్వా జగన్‌(36) అక్కడిక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న బామండ్ల రాకేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై బండ ప్రశాంత్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో విరిగిన విద్యుత్తు స్తంభం

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని