logo
Updated : 27/11/2021 06:34 IST

ఫుడ్‌కోర్టులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ముకరంపుర ప్రాంతంలోని ఓ ఫుడ్కోర్టులో విద్యుత్తు షార్ట్‌ సర్కూట్‌తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పద్మనాయక కల్యాణ మండపం సమీపంలో రెండు అంతస్తు భవనం కింది భాగంలో గత కొంత కాలంగా ఫుడ్‌కోర్టును కొనసాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడ్డాయి.  పై అంతస్తులోని బాలికల వసతి గృహంలో నిద్రిస్తున్న విద్యార్థినులు, మహిళలు కేకలు వేస్తూ కిందకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.


చలో దిల్లీ గోడప్రతుల ఆవిష్కరణ

కరీంనగర్‌ సంక్షేమ విభాగం : బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ డిసెంబరు 13,14,15 తేదీల్లో చేపట్టిన చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను శుక్రవారం బీసీ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు.  రాష్ట్ర కార్యదర్శి రాగి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు నాగుల కనుకయ్యగౌడ్‌, జీఎస్‌ ఆనంద్‌, రాచమల్ల రాజు, దొగ్గళి శ్రీధర్‌ పాల్గొన్నారు.


దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌ రవాణావిభాగం, న్యూస్‌టుడే: ఐటీఐ, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌కోర్సు పూర్తిచేసిన కరీంనగర్‌ పూర్వ జిల్లా అభ్యర్థుల నుంచి టీఎస్‌ ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం అంచూరి శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు www.apprenticeshipindia.org, tsrtc, karimnagar, location లో తమ అర్హత వివరాలతో పాటు పదోతరగతి మార్కుల జాబితా, ఐటీఐ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రతిభ (మెరిట్‌) ప్రాతిపదికన పదిడిపోల పరిధిలో అవసరం మేరకు అభ్యర్థులను తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల 10 లోపు అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.


మద్యం బాబులకు జరిమానా

కరీంనగర్‌ నేరవార్తలు: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారికి కోర్టు జరిమానా విధించింది. పట్టుబడి 10 మంది మందుబాబులకు శుక్రవారం పీసీఆర్‌ కోర్టు మేజిస్ట్రేట్ సరళ రేఖ వారికి మొదటి తప్పుగా ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుమల్‌ తెలిపారు. రెండో సారి పట్టుబడితే జైలు శిక్ష పడుతుందన్నారు.


మట్కా జూదరుల పట్టివేత

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని ముకరంపుర ప్రాంతంలోని ఓ ఇంట్లో కొంతమంది ఆన్‌లైన్‌ ద్వారా మట్కా ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ఎం.డి.అబ్దుల్‌ అలీం, ఎం.డి.అబ్దుల్‌ ఖయ్యుముద్దిన్‌, ఎం.డి.మోయిజుద్దిన్‌, ఎం.డి.జాకిర్‌ హుస్సేన్‌, ఎం.డి.ఉమర్‌ను పట్టుకున్నారు. మీర్‌ సాదత్‌ అలీ, ఎం.డి.అలీ సలీం, షీఫీయుల్ల పరారీలో ఉన్నారు. కళ్యాణ్‌ చాడ్‌ వద్ద జూదం చిట్టితో పాటు రూ.5,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రెండో ఠాణా ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీబాబు తెలిపారు.


యువతి ఆత్మహత్యాయత్నం

సిరిసిల్లపట్టణం : వేములవాడ మండలం చింతల్‌ఠాణాకు చెందిన యువతి శుక్రవారం ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా ఆమెను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కథనం ప్రకారం చింతల్‌ఠాణాకు చెందిన (22) ఏళ్ల యువతిని తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఇష్టం లేదని చెప్పిన వేధింపులకు గురిచేశాడని పేర్కొంది. అతని వేధింపులు భరించలేక సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేశానని ఆ కేసులో అతను జైలుకు వెళ్లి వచ్చాడని ఆమె పేర్కొంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని