logo
Published : 27/11/2021 03:28 IST

చిత్రవార్తలు

నడక దారే అడ్డా

నగరంలోని రాజీవ్‌చౌక్‌ నుంచి గాంధీరోడ్డు వైపు స్మార్ట్‌సిటీలో భాగంగా నడకదారి నిర్మించారు. పనులన్నీ పూర్తి కావడంతో రద్దీ సమయంలో పాదచారులు వెళ్లేందుకు వీలుగా ఉంది. అలాంటి నడకదారిపై తోపుడుబండ్లు, కొబ్బరిబొండాలు, ఇతర వస్తువులు పెట్టి ఆటంకాలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా పెద్దపల్లి రోడ్డులో నాకా చౌరస్తా నుంచి బైపాసు కూడలి వరకు రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌ ఆక్రమణలు యథావిధిగా ఉండగా పట్టణ ప్రణాళిక అధికారులు పట్టించుకోవడం లేదు.

-న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, 


మురుగును తొలగించరూ

రూరల్‌ మండలం దుర్శేడులోని 1వ వార్డులో పేరుకుపోయిన మురుగును తొలగించాలని వార్డు ప్రజలు కోరారు. లక్ష్మీనారాయణ ఇంటి పరిసరాలు మొత్తం మురుగు పేరుకుపోయి దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

-న్యూస్‌టుడే, దుర్శేడు(కరీంనగర్‌ గ్రామీణం


మూణ్నాళ్లకే చెదిరిన తారు

కోనరావుపేట మండలం నాగారం-మర్తన్‌పేట గ్రామాల మధ్య ఇటీవల డీఎంఎఫ్‌టీ నిధులు రూ.95 లక్షల వ్యయంతో సుమారు 3.5 కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. తారు రోడ్డు నిర్మాణం పనుల్లో గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం, అధికారుల పర్యవేక్షణ లోపించటంతో పదికాలాల పాటు మన్నికగా ఉండాల్సిన రోడ్డు మూణ్నాళ్లకే తారు చెదిరిపోయింది. దీంతో వాహనదారుల రాకపోకల సౌకర్యం కొద్దిరోజులే ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు తారు చెదిరిన చోట మరమ్మతులు చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే,కోనరావుపేట

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని