logo
Published : 27/11/2021 03:28 IST

కదం తొక్కిన కర్షకులు

 కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

ర్యాలీగా వస్తున్న అన్నదాతలు

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం కర్షకులు కదం తొక్కారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని, యాసంగి పంటల సాగుపై స్పష్టతనివ్వాలని జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునివ్వగా అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు పాతబస్టాండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌ మీదుగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించిన రైతులు జగిత్యాల-కరీంనగర్‌ రహదారిపై కలెక్టరేట్‌ ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించగా రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. వాహనాల రాకపోకలకు అటంకం కలగడంతో పోలీసులు దారి మళ్లించారు. ధాన్యం కొనుగోలులో తీవ్రజాప్యం జరుగుతోందని మిల్లర్లు దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపించారు. నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసినప్పటికి తూకం వేయటం లేదని నాణ్యతగా ఉన్నప్పటికి 40 కిలోల బస్తాకు మూడు కిలోలు కోత విధిస్తూ మిల్లర్లు మోసానికి పాల్పడుతున్నారన్నారు. ధాన్యం చివరి గింజ వరకూ కొంటామన్న సీఎం కేసీఆర్‌ రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవటం లేదని కల్లాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం ధాన్యాన్ని వెంటనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. యాసంగి పంటల సాగుపై స్పష్టతనివ్వాలని నీరున్న ప్రాంతాల్లో కచ్చితంగా వరిసాగు చేస్తామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో వ్యాపారులు రైతులను ముంచుతున్నారని ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలని డిమాండ్‌ చేశారు.  
తోపులాట...ఉద్రిక్తత: రైతుల ధర్నాను విరమింపజేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఒకదశలో పోలీసులు, రైతుల మధ్య తోపులాటకు దారి తీసి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్మారం గ్రామానికి చెందిన యాగండ్ల మల్లేశం అనే రైతు డీజిల్‌ ఒంటిపై పోసుకునేందుకు యత్నించగా పోలీసులు, తోటి రైతులు అడ్డుకున్నారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. రైతులను దోచుకుంటున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయగా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆర్‌.ప్రకాష్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. రైతు సమస్యలపై కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. రైతు నాయకులు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, బందెల మల్లయ్య, కొట్టాల మోహన్‌రెడ్డి, గురిజాల రాజిరెడ్డి, షేర్‌ నర్సారెడ్డి, కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, వామన్‌రెడ్డి, సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, వేముల కరుణాకర్‌రెడ్డి, ఏనుగు రమేష్‌రెడ్డి, మేకల మల్లేశం, నాగేశ్వర్‌రెడ్డి, రవి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన రైతులు

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని