logo
Updated : 27/11/2021 06:31 IST

ఆపద వేళ ఆర్థిక భరోసా

కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం
జిల్లాలో 383 దరఖాస్తులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

మంథని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటున్న బాధితులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. వైరస్‌ విజృంభణతో జనజీవనం పూర్తిగా చిన్నాభిన్నమైంది. కొవిడ్‌ బారిన పడిన చాలా మంది మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. బతకాలన్న ఆశతో వైద్య ఖర్చుల కోసం రూ.లక్షల్లో వెచ్చించారు. అయినప్పటికీ చాలా మంది ప్రాణాలు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీ అంతర్జాలంలో పర్యవేక్షిస్తుంది. అన్ని పత్రాలను పరిశీలించి సాయం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ధ్రువీకరణ తప్పనిసరి

* కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధిత కుటుంబాలకు రూ.50 వేల నగదు సాయం పంపిణీ చేయాలని సంకల్పించింది.

* ప్రభుత్వ సాయం కోసం బాధిత కుటుంబాలు మీసేవ కేంద్రాలకు వెళ్లి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష, మరణ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు, దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా పాసుపుస్తకం, ఆధార్‌కార్డు అందించాల్సి ఉంటుంది.

* చాలా మంది కొవిడ్‌ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లుగా మరణ ధ్రువపత్రం ఇవ్వడం లేదు. వందల సంఖ్యలో చనిపోతే అధికారులు మాత్రం నామమాత్రంగా నమోదు చేశారు.

త్రిసభ్య కమిటీ పరిశీలన

* జిల్లాలో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా పాలనాధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో డీఎంహెచ్‌వో, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణాధికారి సభ్యులుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో మీసేవ దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.

* అన్ని ధ్రువపత్రాలుంటే మంజూరు కోసం ప్రతిపాదించనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మీసేవ కేంద్రాల్లో 383 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

* వైద్య శాఖ గణాంకాల ఆధారంగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 21,883 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 253 మంది మృతి చెందారు. వాస్తవానికి కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉండటంతో సరైన ధ్రువపత్రాలుంటేనే మీసేవ నిర్వాహకులు దరఖాస్తు చేస్తున్నారు.

మార్గదర్శకాలు పాటించాలి ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో కొవిడ్‌ మృతుల కుటుంబాల సభ్యులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో కమిటీ సభ్యులం పరిశీలిస్తాం. అన్ని అర్హత ధ్రుపపత్రాలు ఉంటేనే సాయం మంజూరవుతుంది. బాధిత కుటుంబ సభ్యులు మార్గదర్శకాలు పాటించాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని