logo
Published : 27/11/2021 03:28 IST

వైభవంగా గోదావరి మహాహారతి

మంథనిలో గోదావరికి హారతి ఇస్తున్న వేద పండితులు, అర్చకులు, భక్తులు

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: పవిత్ర కార్తికమాసం పురస్కరించుకొని శుక్రవారం రాత్రి మంథనిలో గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పండితులు, భక్తులు మొదట గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలను, నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం మహాహారతిని నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన హనుమాన్‌ ఉపాసకులు పరబ్రహ్మానందగిరిస్వామి కార్యక్రమ విశిష్ఠతను భక్తులకు వివరించారు. నదీ తీరంలో మహిళా భక్తులు లలితా పారాయణాన్ని పఠించారు. ఉత్సవ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ క్యాతం వెంకటరమణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శైలజ, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ సంతోషిణి, నిర్వాహకులు లింగం శంకర్‌, పోతరాజు సమ్మయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని