logo
Published : 27/11/2021 03:28 IST

హక్కులు, విధులపై అవగాహన

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజలందరికీ విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని వ్యవస్థలకు బాధ్యతలు, అధికారాలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. అనంతరం కలెక్టర్‌ కలెక్టర్‌ సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. పాలనాధికారి ఏవో గంగయ్య, విభాగాల పర్యవేక్షకుడు శ్రీకాంత్‌, రామకృష్ణ, రవికాంత్‌, సుజాత, రమేష్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

* సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. జిల్లా అదనపు జడ్జి జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ కనకశ్రీ విజయ రఘునందన్‌, అధ్యాపకులు వెంకటేషం, కనకయ్య, మేఘశ్యామ్‌, రాజయ్య, పరుశరాం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అదనపు జడ్జి జాన్సన్‌

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని