logo
Published : 27/11/2021 03:28 IST

భర్తను కోల్పోయి ఒంటరైన వృద్ధురాలు

బింగి రాములు, రాధమ్మ

జనగామ, న్యూస్‌టుడే:  అయిన వారిని నమ్మి అన్యాయానికి గురయ్యారు.. అప్పు తీసుకున్న బంధువు ఆచూకీ వెతుకుతూ జనగామ చేరిన దంపతుల్లో భర్త చనిపోయి ఒంటరైన వృద్ధురాలి దీనస్థితి స్థానికులను కలచివేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల సమీపంలోని చేనేత కుటుంబానికి చెందిన బింగి రాములు(85), రాధమ్మ(80) కొంతకాలం క్రితం జనగామ వచ్చారు. వారు ఓ సమీప బంధువుకు పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వగా మోసం చేసి ఉడాయించాడు. వెతుక్కుంటూ జనగామలో ఉన్నాడని తెలుసుకుని ఇక్కడకు వచ్చారు. వారి అన్వేషణ ఫలించలేదు. వీవర్స్‌కాలనీకి చెందిన గుర్రం నాగరాజు వారిలో ఒకరికి పింఛన్‌ మంజూరు చేయించారు. నిస్సహాయ స్థితిలో మినీ స్టేడియంలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన రాములు వారం నుంచి కనిపించడం లేదు. వెతికే ఓపిక లేని రాధమ్మ తనలో తానే కుమిలిపోయింది. శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ వద్ద కుళ్లిన స్థితిలో రాములు మృతదేహం లభించింది. 12వార్డు కౌన్సిలర్‌ గుర్రం భూలక్ష్మి భర్త నాగరాజు, కాలనీ వాసులు, కమిషనర్‌ నర్సింహ, శానిటరీ అధికారి రాజేశ్‌ సహకారంతో మృతదేహానికి అంత్యక్రియలు చేయించారు. ఒంటరైన ఆ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో రోదిస్తోంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని