logo
Published : 27/11/2021 03:28 IST

రవీందర్‌సింగ్‌ది అవకాశవాద రాజకీయం

మేయర్‌ సునీల్‌రావు

మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్‌ మేయర్‌గా రవీందర్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పించిన విషయాన్ని మరిచి ఇప్పుడు ఆయన పదవీ కాంక్షతో తెరాసను వీడి అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మేయర్‌ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీనామా ప్రకటనలో అవాస్తవాలు, అభూతకల్పనలు చెప్పారని, అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెరాసను వీడిపోయే ముందు వాస్తవాలు చెప్పే ధైర్యం రవీందర్‌సింగ్‌కు లేకపోవడం శోచనీయమన్నారు. 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్నానని, తనకు పార్టీలో ఎమ్మెల్సీ టికెట్‌ ఇస్తామని మాటిచ్చారని ఆయన చెప్పడం అవాస్తమని పేర్కొన్నారు. జిల్లాలో ఎంతో మంది ఉద్యమకారులు, సీనియర్‌ నాయకులు పదవులు రాకున్నా తెరాసపై విశ్వాసంతో క్రమశిక్షణతో పనిచేస్తున్నారని, కానీ రవీందర్‌సింగ్‌ పదవీ కాంక్షతో తెరాసపై విమర్శలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పోటీ కోసం భాజపా, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో ప్రపోజ్‌ చేయించుకోవడం పార్టీకి వ్యతిరేకం కాదా అని తెలిపారు. తెరాస అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించుకుంటామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, తెరాస కార్పొరేటర్లు, కో-అప్షన్‌ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని