Published : 28 Nov 2021 02:59 IST
కార్మికులకు ఈ-శ్రమ్ పథకం వరం
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం తదితరులు
సిరిసిల్ల పట్టణం, న్యూస్టుడే: వస్త్రపరిశ్రమలోని కార్మికులకు ఈ-శ్రమ్ పథకం ఒక వరమని సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం తయారు చేసిన కరపత్రాలను శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ-శ్రమ్ పథకంలో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేస్తున్నారని, ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం ఉంటుందన్నారు. డిసెంబర్ 31లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 156 కుల వృత్తులకు సంబంధించిన అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పథకం కల్పవృక్షమవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తమిళనాడు చీరల యజమాని రామారావు, రేగుల మార్కండేయులు, కొండి నరేందర్, ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు.
Tags :