logo
Updated : 28/11/2021 03:00 IST

ఉరేసుకొని మరమగ్గాల కార్మికుడి ఆత్మహత్య

మృతి చెందిన బాలలింగం

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన మరమగ్గాల కార్మికుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్ల పట్టణంలోని సుబాష్‌నగర్‌కు చెందిన మరమగ్గాల కార్మికుడు సిరిసిల్ల బాలలింగం (68) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిని కుమారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను వేములవాడ మండలంలోని సంకెపల్లి శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని