logo
Updated : 28/11/2021 04:22 IST

బాల్యం బలహీనం

వయసుకు తగ్గట్లుగా కనిపించని ఎదుగుదల

గ్రోత్‌ మానిటరింగ్‌ సర్వేలో వెల్లడి

కరీంనగర్‌ మంకమ్మతోట, న్యూస్‌టుడే

చిన్నారుల బరువు చూస్తున్న అంగన్‌వాడీ టీచర్‌

నేటి బాలలే రేపటి పౌరులు.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే అభివృద్ధికి బాటలు పడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైనప్పటి నుంచి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయినా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న గ్రోత్‌ మానిటరింగ్‌ సర్వేలో చిన్నారుల ఎదుగుదల లోపం తేటతెల్లమవుతోంది. జిల్లా సంక్షేమ అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యస్థితి నిర్ధారణ ఇలా

జిల్లాలో నాలుగు ప్రాజెక్ట్‌ల పరిధిలో 777 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటి పరిధిలో నమోదైన పిల్లల సంఖ్య 48,016. కేంద్రాల వారీగా అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు పిల్లల వయసు, బరువు, ఎత్తు నమోదు చేస్తున్నారు. ఆరు నెలల దాటిన వారి నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో, లేదా ఇంటి వద్దకే వెళ్లి ఎత్తు, బరువు చూసి నమోదు చేస్తున్నారు. అతి తక్కువ బరువు ఉండటానికి గల కారణం ఏమిటి? పోషణ లోపమా, ఆరోగ్యపరమైన సమస్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు

వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గుర్తించిన పిల్లల గృహాలను సందర్శించడంతో పాటు ఎప్పటికప్పుడు వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంట్లో పౌష్టికాహారం తయారీ విధానాన్ని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.

శ్రద్ధ తీసుకుంటున్నాం

- బి.రవీందర్‌, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న గ్రోత్‌ మానిటరింగ్‌ సర్వేలో అతి తక్కువ బరువు, ఎత్తు ఉన్నట్లు గుర్తించిన పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అందుకోసం వారికి పర్యవేక్షణతో కూడిన పోషకాహారం అందేలా చర్యలు చేపడుతున్నాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని