logo
Published : 28/11/2021 02:59 IST

ధాన్యానికి నిప్పుపెట్టి రైతుల నిరసన

కస్బెకట్కూర్‌లో నిరసన తెలుపుతున్న రైతులు

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రెండు నుంచి మూడు కిలోలు తరుగు తీస్తున్నారంటూ శనివారం రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. తాలు పట్టిన తర్వాత కూడ అదనంగా ధాన్యం కోత పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేయాలని, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.


అమ్మోనియా వాయువు లీక్‌

ఫెర్టిలైజర్‌సిటీ, న్యూస్‌టుడే: రామగుండం ఎరువులు రసాయనాల కర్మాగారంలో అమ్మోనియా వాయువు వెళ్లే పైపులైన్‌ లీకైంది. శనివారం ప్లాంటులోని అమ్మోనియా ప్లాంట్‌ నుంచి యూరియా కన్వర్షన్‌లోకి వెళ్లే పైపులైన్‌ లీకు కావడంతో పది నిమిషాల పాటు రసాయన వాసనలు వ్యాపించాయి. అమ్మోనియా పైపులైన్‌ లీకైన ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అమ్మోనియా పైపులైన్‌ లీకైన వెంటనే ఆటోమేటిక్‌గా ఆగిపోయే వ్యవస్థ ఉండటంతో భారీ ఎత్తున బయటకు రాకుండా ఆగిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది.


 

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని