logo
Published : 28/11/2021 02:59 IST

చట్టాలపై అవగాహన అవసరం

ఖైదీలతో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని ఖైదీలకు సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్‌తో కలిసి శనివారం కరీంనగర్‌ కారాగారాన్ని పరిశీలించారు. పోక్సో చట్టం కేసులో అనేక మంది విద్యార్థులు విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. కారాగారం నుంచి బయటకు వెళ్లిన తరువాత ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నించాలని చెప్పారు. దేశంలోని చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన పొంది ఉండాలన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని వారికి లీగల్‌ ఎయిడ్‌ సంస్థ ద్వారా ప్రభుత్వ న్యాయవాదిని పెట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఖైదీల సంక్షేమ, వారి కేసుల వివరాలను, కారాగారంలో కల్పిస్తున్న సౌకర్యాలను ఖైదీల ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేజిస్ట్రేట్లు కె.ప్రసాద్‌, ఇ.ఎస్‌.హేమలత, పి.సరళరేఖ, కారాగార పర్యవేక్షణాధికారి జి.సమ్మయ్య, జైలర్‌ పి.శ్రీనివాస్‌, బి.రమేష్‌, డిప్యూటీ జైలర్స్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌.సుధాకర్‌రెడ్డి, ఎల్‌.రమేష్‌ ఉన్నారు.

జైలు అదాలత్‌

కరీంనగర్‌ జిల్లా కారాగారంలో శనివారం జైలు అదాలత్‌ నిర్వహించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పలు కేసులను పరిష్కారించారు. చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కె.ప్రసాద్‌ ఆధ్వర్యంలో జైలు అదాలత్‌ నిర్వహించారు. 44 ఖైదీలకు సంబంధించిన 84 కేసులను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. 8 మంది ఖైదీలకు సంబంధించిన 11 కేసులను పరిష్కరించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని