logo
Published : 30/11/2021 03:21 IST

రూ.1400 కోట్లతో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి

మొక్క నాటుతున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి ఛైర్మన్‌ శ్రీనివాస్‌

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో రూ.1400 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడలోని తిప్పాపూర్‌ హరిత హోటల్‌ వద్ద గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆధ్మాత్మికంతో పాటు పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాజన్న ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయాన్ని పునఃనిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటక శాఖ నుంచి ప్రత్యేక ప్యాకేజీల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం, మధ్య మానేరు జలాశయాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ హరిత హోటల్‌లో మెరుగైన సౌకర్యాలు, భక్తుల కోసం వసతి గదులను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కటకం కిషన్‌, మడూరి శ్రీనివాస్‌, కటకం జనార్దన్‌, మాడిశెట్టి కృపాల్‌, పైడి శ్రీనివాస్‌, శేఖర్‌, అనిల్‌కుమార్‌, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని