logo
Published : 30/11/2021 03:21 IST

మూడో ముప్పుపై అప్రమత్తం

మొదటి డోసు 92 శాతం పూర్తి
నిరంతరాయంగా వ్యాక్సినేషన్‌
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

రోనా మూడో ముప్పు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారితోనే రెండో దశలో కరోనా ఎక్కువ వ్యాప్తి చెందింది. రోజుకు వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో 270 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయాల్లో మందులు.. ఇతర మౌలిక వసతులపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవాలంటే ప్రజలు మాస్కులు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. టీకా రెండు డోసులు తప్పనిసరి.

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. కొందరు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 4,22,182 మొదటి డోసు టీకా లక్ష్యానికి ఇప్పటికీ 3,90,242 మందికి పూర్తయింది. మొదటి డోసులో 92 శాతం పూర్తయింది. కొన్ని పంచాయతీలు వందశాతంతో ముందంజలో ఉన్నాయి. రెండో డోసు 46 శాతానికి చేరింది. అర్హులైన వారిలో ఇంకా 12 శాతం మంది ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా తీసుకోవడం ద్వారా శతశాతం లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటికీ 5,76,174 డోసులను వైద్యఆరోగ్యశాఖ ప్రజలకు పంపిణీ చేసింది. జిల్లాలో రోజుకి కరోనా పాజిటివ్‌ శాతం 0.5-0.6శాతం ఉంది. రెండో డోసు టీకా వేసుకోని వారు తీసుకోవాలి. అసలు టీకా తీసుకోని, రెండో డోసు పూర్తికాని వారిలో కరోనా పాజిటివ్‌లు వస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ చెబుతోంది.

నిర్లక్ష్యం అసలే వద్దు
జిల్లాలో గతంతో పోల్చితే కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సగటున రోజుకు 750 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం నలుగురు పాజిటివ్‌ బారిన పడుతున్నారు. కొవిడ్‌ ప్రారంభం నుంచి 32,348 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా అందులో 31,704 మంది కోలుకున్నారు.. ప్రస్తుతం 75 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. వైరస్‌ ప్రభావంతో ఇప్పటికీ మొత్తం 569 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. బయటకు వచ్చినపుడు.. వేడుకల్లో కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. కొన్ని చోట్లయితే మాస్కులు ధరించకపోవడం గమనార్హం. నిర్లక్ష్యం కారణంగా మనతోపాటు చుట్టుపక్కల వారికి నష్టం తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి
- సుమన్‌ మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. మన దగ్గర లేనప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఏ వేరియంట్‌ నుంచైనా ముప్పు తక్కువగా ఉంటుంది. వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్తూ టీకాలు ఇస్తున్నారు. దానికి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి కాపాడేది వ్యాక్సిన్‌ మాత్రమే. మొదటి డోసు వేసుకుని, రెండో డోసు వేసుకోని వారు వెంటనే వేసుకోవాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని