logo
Published : 30/11/2021 03:21 IST

కారు ఢీకొని మహిళ మృతి

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : కార్తిక సోమవారం దేవాలయానికి బయల్దేరిన సుంకవల్లి అనురాధ(47) అనే మహిళ ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ అడ్డరోడ్డులో రహదారి ప్రమాదంలో మృతి చెందడం ఈ ప్రాంతంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన భానుప్రసాద్‌ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌. ఆయన భార్య అనురాధ కృష్ణానగర్‌ నుంచి ద్విచక్రవాహనంపై సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పీటీఎస్‌ సమీపంలోని ఆలయానికి బయల్దేరారు. ఎఫ్‌సీఐ అడ్డరోడ్డులో రహదారిని దాటుతున్న క్రమంలో గోదావరిఖని వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో గోదావరిఖని ఆస్పత్రికి తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కుమారుడు హర్షవర్ధన్‌ యూఎస్‌ఏలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె నవ్యచౌదరి ఎంబీబీఎస్‌ ఇటీవలే పూర్తి చేశారు. కుమారుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
 

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని